News December 2, 2024
నా పేరు కిస్సిక్ లీలగా మార్చారు: శ్రీలీల

పుష్ప-2లో శ్రీలీల ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో నటించాక తన పేరును కిస్సిక్ లీలగా దేవిశ్రీప్రసాద్ మార్చినట్లు శ్రీలీల చెప్పారు. ‘పుష్ప-2’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. శ్రీలీల ఐటమ్ సాంగ్‌లో కనిపించడం ఇదే తొలిసారి.
Similar News
News January 8, 2026
10pmకు రాజాసాబ్ ప్రీమియర్ షో.. అయితే!

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌పై ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. రాత్రి 10 గంటలకు బాలానగర్ విమల్ థియేటర్లో షో వేయనున్నారు. దీనికి కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నారు. అటు ఏపీలో మాత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి.
News January 8, 2026
ACB కేసుల్లో దర్యాప్తు జరగాల్సిందే: సుప్రీంకోర్టు

AP: ACB నమోదు చేసిన FIRలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ACB సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(CIU)-విజయవాడ ఫైల్ చేసిన అన్ని FIRలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 6నెలల్లో తుది నివేదిక ఇవ్వాలని, ప్రతివాదులను అరెస్ట్ చేయొద్దని సూచించింది. ACB CIUకు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదనే కారణంతో FIRలను హైకోర్టు గతంలో కొట్టేసింది. దీన్ని SCలో ACB సవాలు చేసింది.
News January 8, 2026
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రుల దండయాత్ర

AP: జగన్ అమరావతిపై చేసిన <<18799615>>కామెంట్స్<<>> రాష్ట్రంలో ముందుగానే భోగి మంటలు రాజేశాయి. మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్‌కు దిగారు. ఇటీవల YCP చేసిన ఏ ఆరోపణల మీదా ఇలా వెంటనే ఎదురుదాడి చేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశం, రూ.వందల కోట్ల మేర పనులు జరుగుతున్న ప్రాంతంపై ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లొద్దనే ఇలా రియాక్ట్ అయినట్లు టాక్.


