News April 6, 2024
గెలుపు కోసం మార్పులు!

రాజస్థాన్తో మ్యాచ్లో బెంగళూరు టీమ్ పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. గత రెండు మ్యాచుల్లో విఫలమైన అనుజ్ స్థానంలో లోమ్రోర్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది. ఇదే జరిగితే దినేశ్ కార్తీక్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే బౌలర్ రీస్ టోప్లీ ప్లేస్లో న్యూజిలాండ్ స్పీడ్స్టర్ లాకీ ఫెర్గూసన్ను ఆడించనున్నట్లు సమాచారం. ఇక ఆల్ రౌండర్ మనోజ్ భాండగే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశముంది.
Similar News
News December 16, 2025
ఇందిరమ్మ ఇళ్లకు మరో ₹5,000Cr.. త్వరలో ఖాతాల్లోకి!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధుల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల హడ్కో నుంచి ₹5,000Cr లోన్ తీసుకుంది. క్యాబినెట్ ఆమోదించాక వాటిని లబ్ధిదారులకు జమ చేసే అవకాశముంది. GHMC, అర్బన్ ఏరియాల్లో టవర్ల పద్ధతిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకూ ఈ నిధులనే వినియోగించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48L ఇళ్ల పనులు జరుగుతున్నాయి. 2026 MAR నాటికి లక్ష గృహప్రవేశాలు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం.
News December 16, 2025
ఎలుకలతో పంటకు తీవ్ర నష్టం.. ఎలా నివారిద్దాం?

వ్యవసాయంలో చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల తర్వాత ఎక్కువ నష్టం ఎలుకల వల్ల వాటిల్లుతోంది. విత్తన దశ నుంచి కోత, నిల్వ వరకు ఎలుకలు ఏదో రూపంలో పంటకు, ఉత్పత్తులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అనేక చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్నకు వీటి ముప్పు చాలా ఎక్కువ. విషపు ఎర, ఇనుప తీగల ఉచ్చు, పొగపెట్టడం ద్వారా ఎలుకలను ఎలా నిర్మూలించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 16, 2025
టీచర్లకు బోధనేతర పనులొద్దు!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని టీచర్లకు బోధనేతర పనులు కేటాయించొద్దని అధికారులకు విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజు ఆదేశాలిచ్చారు. టెన్త్ విద్యార్థులకు రోజూ స్లిప్ టెస్టులు నిర్వహించాలన్నారు. కాగా పాఠశాల స్థాయిలోనే క్వశ్చన్ పేపర్లు తయారుచేసే వెసలుబాటు కల్పించారు. గతేడాది వాటిని పైస్థాయి నుంచి పంపేవారు. ఉత్తీర్ణత శాతం పెంపు బాధ్యత కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారిపై ఉండనుంది.


