News July 22, 2024
ఆరో తరగతి పుస్తకంలో మార్పులు

NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్కు సొంతంగా ప్రధాన మధ్య రేఖ ఉందని, MPలోని ఉజ్జయిని మీదుగా వెళ్లే దీన్ని ‘మధ్య రేఖ’ అంటారని పేర్కొంది. కులవివక్ష ప్రస్తావన లేకపోవడం, బీఆర్ అంబేడ్కర్ అనుభవించిన వివక్ష అంశాల్లో సర్దుబాట్లు, హరప్పా నాగరికతను ‘సింధు సరస్వతి’గా పేర్కొనడం వంటి మార్పులు జరిగాయి.
Similar News
News December 18, 2025
పారదర్శక సేవలకు ‘ఈ-ఆఫీస్’ కీలకం: జేసీ నిశాంతి

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకమైన, వేగవంతమైన సేవలందించేందుకు ‘ఈ-ఆఫీస్’ విధానం ఎంతో కీలకమని జేసీ నిశాంతి పేర్కొన్నారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బందికి ఈ-ఆఫీస్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఫైళ్ల కదలిక, సమాచార నమోదులో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని ఆమె సూచించారు.
News December 18, 2025
గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు మావే: రేవంత్

TG: పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించిన ఎన్నికల, ప్రభుత్వ సిబ్బందిని సీఎం రేవంత్ అభినందించారు. మూడు విడతలుగా 12,702 చోట్ల జరిగిన ఎన్నికల్లో 7,527 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 808 స్థానాలను పార్టీ రెబల్స్ గెలుచుకున్నారని వెల్లడించారు. మొత్తం 8,335(66%) తాము విజయం సాధించామని చెప్పారు. 3,511 స్థానాల్లో BRS, 710 బీజేపీ, 146 చోట్ల ఇతరులు గెలిచారని వెల్లడించారు.
News December 18, 2025
అపర శక్తిమంతుడు ‘విష్ణుమూర్తి’

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్||
అపర శక్తిమంతుడు, సాటిలేని పరాక్రమవంతుడు, తేజస్సు, కాంతి గలవాడు, ఎవరూ ఊహించలేనంత అద్భుత రూపం కలవాడు విష్ణువు. లక్ష్మీదేవితో ఉండే శ్రీమంతుడైన ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన చరిత్ర గల మహాశక్తి సంపన్నుడు. ఇంతటి శక్తులు గల పరమాత్ముడిని భక్తితో దర్శించడం వలన, మనకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


