News March 16, 2024

81 స్థానాల్లో మార్పులు

image

AP: వైసీపీ ప్రకటించిన 175 ఎమ్మెల్యే స్థానాల్లో 81 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చింది. అలాగే 18 మంది సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిలో పలువురిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేయగా మరికొంత మందికి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. దాదాపు 50 శాతం స్థానాల్లో మార్పులు చేశామని.. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని సీఎం జగన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం టికెట్లు ఇచ్చామని చెప్పారు.

Similar News

News December 3, 2024

పుష్ప-2కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

image

పుష్ప-2ను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తీశారని శ్రీశైలం అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. సినిమా చూశాకే విడుదలకు సెన్సార్ బోర్డ్ అనుమతించిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదించారు. ఊహాజనితంగా తీసిన మూవీ విడుదలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు జరిమానా విధిస్తామని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

News December 3, 2024

రెడ్ సీ ఫెస్టివల్‌లో ఆమిర్ ఖాన్‌కు సన్మానం

image

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సన్మానం జరగనుంది. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్‌తో పాటు ఆమిర్‌ను సత్కరించనున్నట్లు ఫెస్టివల్ నిర్వాహకులు ట్విటర్‌లో తెలిపారు. ఈ నెల 5 నుంచి 14 వరకు ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ నటులు ఆండ్రూ గార్ఫీల్డ్, ఈవా లాంగోరియా, బాలీవుడ్ నుంచి కరీనా కపూర్, రణ్‌బీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

News December 3, 2024

RECORD: 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్

image

కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అత్యంత పిన్నవయస్కురాలిగా కర్ణాటకలోని విజయపురకు చెందిన సమైరా హుల్లుర్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల సమైరా ఏడాదిన్న‌ర‌లో 6 ప‌రీక్ష‌లు క్లియ‌ర్ చేసి 200 గంట‌ల ఫ్లయింగ్ అవ‌ర్ అనుభ‌వాన్ని పొందారు. 25 ఏళ్లకే పైల‌ట్ లైసెన్స్ పొందిన కెప్టెన్ తాపేశ్ కుమార్ త‌న స్ఫూర్తి అన్నారు. త‌ల్లిదండ్రులు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని లైసెన్స్ పొందిన సంద‌ర్భంగా స‌మైరా హ‌ర్షం వ్య‌క్తం చేశారు.