News October 28, 2025
పంట నష్టాన్ని రైతులు నమోదు చేసేలా యాప్‌లో మార్పులు: CM CBN

AP: పంట నష్టాన్ని రైతులు పంపేలా వ్యవసాయశాఖ యాప్‌ను మార్చాలని CM CBN ఆదేశించారు. పంట నష్టం సహ వర్షాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ‘కాకినాడకు మరిన్ని రెస్క్యూ బృందాలు పంపాలి. సీమలో వర్షాలు లేనందున చెరువుల్లో నీటిని నింపాలి’ అని సూచించారు. 43వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు నివేదించారు. 81 టవర్లతో వైర్‌లెస్ సిస్టమ్, 2703 జనరేటర్లు రెడీ చేశామన్నారు.
Similar News
News October 28, 2025
9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు: CBN

AP: 403 మండలాలపై మొంథా ప్రభావం చూపుతోందని CM CBN తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. 7 జిల్లాల్లో ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ రాత్రి 9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ రాత్రి 11.30 తర్వాత తుఫాన్ తీరం దాటవచ్చని చెప్పారు.
News October 28, 2025
ఆగిన రష్యన్ ఆయిల్ దిగుమతులు.. నెక్స్ట్ ఏంటి?

రష్యాలోని టాప్ ఎనర్జీ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో భారత రిఫైనరీలు కొత్తగా ఆయిల్ దిగుమతులపై వెనుకడుగు వేస్తున్నాయి. పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయంలో ప్రభుత్వం, సప్లయర్ల నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్రెష్ ఆయిల్ టెండర్ జారీ చేసిందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ బయ్యింగ్‌కు సిద్ధమైందని తెలిసింది.
News October 28, 2025
భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

భగవద్గీత మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం, వినయవంతులు ఔన్నత్యం కోసం భగవద్గీతను చదవాలి. మోక్షం కోరేవారు, అశాంతిగా ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఉత్తమ జీవితం కోసం గీతను అధ్యయనం చేయాలి.


