News January 22, 2025
APSP బెటాలియన్లలో మార్పులు

APSP బెటాలియన్లలో మంగళగిరి, కర్నూలు కేంద్రంగా DIGలు ఉంటారని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి DIG పరిధిలోకి ఎచ్చెర్ల, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను, DIG-2 పరిధిలోకి కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లతో పాటు SAR సీపీఎల్ యూనిట్‌ను చేర్చింది.
Similar News
News November 13, 2025
ఆసిమ్ మునీర్‌కు విస్తృత అధికారాలు!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ విస్తృత అధికారాలు పొందేందుకు రాజ్యాంగ సవరణకు ఆమోదముద్ర పడింది. ఇది అన్ని సైనిక శాఖలపై అతనికి అత్యున్నత అధికారాన్ని కల్పించడమే కాకుండా సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తుంది. కొత్త అధికారాలతో నియామకాలు, మధ్యంతర ప్రభుత్వాలపై నియంత్రణ కలిగి ఉండటమే కాకుండా చట్టపరమైన విచారణ నుంచి జీవితకాల రక్షణ పొందుతారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు, పలువురు జడ్జిలు ఖండించారు.
News November 13, 2025
WTCలో 12 జట్లు!

వచ్చే సీజన్ నుంచి WTC(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్)లో 12 జట్లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 జట్లు ఆడుతుండగా 2027-29 సీజన్‌కు 12కు పెంచే యోచనలో ICC ఉన్నట్లు సమాచారం. 2టైర్ సిస్టమ్‌ను రద్దు చేసి ఆఫ్గానిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్‌ను జాబితాలో చేర్చనున్నట్లు ESPN కథనం తెలిపింది. దీంతో ప్రతి జట్టుకు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 13, 2025
ఎప్స్టీన్ ఇంట్లో ట్రంప్ గంటలు గడిపాడు: డెమోక్రాట్లు

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ గంటలకొద్ది సమయం వెచ్చించాడని డెమోక్రాట్లు ఈమెయిల్స్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బాలికల లైంగిక వేధింపుల గురించి ముందే తెలుసని ఆరోపించారు. అయితే ఇది డెమోక్రాట్లు పన్నిన ఉచ్చు అని ట్రంప్ ఖండించారు. వారి మోసాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు డెమోక్రాట్లు ఏమైనా చేస్తారని ఫైరయ్యారు.


