News December 10, 2024

CUET- 2025 ఎడిషన్‌లో మార్పులివే

image

2025 నుంచి UG లో ప్ర‌వేశాల‌కు Common University Entrance Testలో విద్యార్థులు గ‌రిష్ఠంగా ఆరుకు బ‌దులు 5 స‌బ్జెక్టులు రాయగలరు. *స‌బ్జెక్టుల సంఖ్య 63 నుంచి 37కి త‌గ్గింపు. *కంప్యూట‌ర్ ఆధారితంగా జ‌రిగే ఈ ప‌రీక్ష‌ల్లో ఐచ్ఛిక ప్ర‌శ్న‌ల‌ను తొల‌గించ‌డంతో అన్ని ప్ర‌శ్న‌ల‌ను 60 Minలో అటెంప్ట్ చేయాలి. *12వ తరగతిలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టు ప‌రీక్ష‌కైనా హాజ‌రుకావ‌చ్చు. Share It.

Similar News

News January 19, 2026

CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (<>CMERI<<>>)లో 20 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్+ఐటీఐ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.37వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cmeri.res.in

News January 19, 2026

YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

News January 19, 2026

బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.