News August 21, 2024
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు

TG: ఎడ్‌సెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 8 నుంచి మొదలైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 23 వరకు కొనసాగుతుంది. 24వ తేదీ నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. 27న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. 30న సీట్లు కేటాయిస్తారు. 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీలోగా తమకు సీటు వచ్చిన కాలేజీలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి.
Similar News
News November 14, 2025
సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.
News November 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 66 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 14, 2025
వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.


