News February 28, 2025
పెన్షన్ పంపిణీలో మార్పులు

AP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారుల ఒత్తిడితో చాలా మంది తెల్లవారుజామున 4 నుంచే పంపిణీ చేస్తుండగా ఉద్యోగులతో పాటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికే యాప్ పని చేసేలా మార్పులు చేసింది.
Similar News
News February 28, 2025
Income Tax కొత్త షాక్

పన్ను ఎగవేతదారులను పట్టుకొనేందుకు IT Dept ఏ దారీ వదలడం లేదు. కుటుంబ సభ్యుల వివరాలు, గ్రాసరీస్, షాపింగ్, లైఫ్‌స్టైల్ కోసం ఎవరెంత ఖర్చు పెడుతున్నారో చెప్పాలని కొందరిని కోరినట్టు తెలిసింది. చెప్పకపోతే ఏటా రూ.కోటి ఖర్చుచేసినట్టు భావిస్తామని హెచ్చరించింది. లగ్జరీ లైఫ్‌స్టైల్, అధిక ఆదాయం ఉన్నప్పటికీ తక్కువ డబ్బు విత్‌డ్రా చేస్తుండటంతో ఇలా చేసింది. వారికి మరో ఆదాయ వనరు ఉన్నా చెప్పడం లేదని భావిస్తోంది.
News February 28, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, హెడ్, స్మిత్, లబూషేన్, ఇంగ్లిస్, కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షియష్, ఎల్లిస్, జంపా, జాన్సన్.
అఫ్గాన్: గుర్బాజ్, జద్రాన్, అటల్, రహ్మత్, హస్మతుల్లా, ఒమర్జాయ్, నబీ, నాయబ్, రషీద్, నూర్, ఫరూఖీ.
News February 28, 2025
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాణీ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు హింట్ ఇస్తూ ఫొటోను పోస్ట్ చేశారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ అమ్మడు 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు.