News April 21, 2025
ఎండల తీవ్రతతో జనవాణి వేళల్లో మార్పులు

AP: ఎండల తీవ్రత దృష్ట్యా జనవాణి వేళల్లో మార్పులు చేసినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా జనవాణి కింద ప్రజా సమస్యలపై జనసేన అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపుతున్న విషయం తెలిసిందే.
Similar News
News April 21, 2025
బంగారం ధర ALL TIME RECORD

బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి తొలిసారి రూ.90,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగి రూ.98,350 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరగడంతో రూ.1,11,000గా ఉంది.
News April 21, 2025
USతో ఒప్పందం చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇతర దేశాలకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశానికి నష్టం కలిగించేలా యూఎస్‌తో ఎవరు ఒప్పందం చేసుకున్నా తీవ్రంగా పరిగణిస్తామని చైనా ప్రకటించింది. ప్రతీకార చర్యలకు వెనుకాడబోమని తేల్చి చెప్పింది. బీజింగ్‌తో ఆర్థిక సంబంధాలు తెంచుకుంటే టారిఫ్స్ నుంచి ఉపశమనం కల్పిస్తామని పలు దేశాలను యూఎస్ ప్రోత్సహిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా ఘాటుగా స్పందించింది.
News April 21, 2025
తిరుమలలో పనిచేయని సిఫార్సు లేఖలు!

AP: వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను TTD తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో లేఖలతో వచ్చిన భక్తుల పరిస్థితి అయోమయంగా మారింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో భక్తులు లేఖలతో శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్నారు.