News June 8, 2024
రెవెన్యూ చట్టంలో మార్పులు?

TG: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ చట్టాల్లో మార్పులు చేయాలని ధరణి కమిటీ భావిస్తోంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ యాక్ట్, 2020లో పలు లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఇందుకు సంబంధించి కమిటీ ఓ నివేదికను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా చట్టంలో మార్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News September 10, 2025
బవుమాకు మళ్లీ అవమానం!

SA టీ20 లీగ్ వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. 2 లక్షల ర్యాండ్‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో బవుమా అన్‌సోల్డ్‌గా మిగిలారు. గత సీజన్‌లోనూ ఆయన అమ్ముడుపోలేదు. కాగా టీ20 ఫార్మాట్‌లో బవుమా 36 మ్యాచుల్లో 118 స్ట్రైక్ రేట్‌తో 670 పరుగులు చేశారు. గతంలో దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు నాయకత్వం కూడా వహించారు.
News September 10, 2025
అనంతపురం సభకు లోకేశ్ దూరం

AP: అనంతపురంలో ఇవాళ జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభకు మంత్రి నారా లోకేశ్ గైర్హాజరు కానున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు ఆయనకు అప్పగించారు. దీంతో లోకేశ్ వెలగపూడిలోని సచివాలయంలో కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఏపీ వాసులను క్షేమంగా రప్పించేందుకు కేంద్ర మంత్రులు, అధికారులతో సమన్వయం చేయనున్నారు.
News September 10, 2025
పాక్‌తో మ్యాచ్.. నెట్టింట విమర్శలు

ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. దాయాదితో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ ఆడేందుకు BCCI ఒప్పుకోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. తాజాగా ‘ఆట మొదలెడదామా’ అని గిల్ చేసిన ట్వీట్‌కు మాజీ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన రిప్లై వైరలవుతోంది. ‘మన శత్రువు పాక్‌తో మ్యాచ్ ఆడే రోజు మీ ఆట అయిపోతుంది’ అని రిప్లై ఇచ్చారు. పహల్గామ్ అటాక్ మర్చిపోయారా? అంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.