News August 18, 2024
ఆధార్ క్యాంపుల షెడ్యూల్లో మార్పులు

AP: రాష్ట్రంలో ఈనెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆధార్ క్యాంపుల షెడ్యూల్ మారింది. టెక్నికల్ సమస్యల వల్ల ఆధార్ సర్వీస్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆపరేటర్లకు ఆన్లైన్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ క్యాంపులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి.
Similar News
News December 23, 2025
చిత్తూరు జిల్లాలో మందగిస్తున్న ఉపాధి పనులు.!

వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూలీల వేతనాల మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల మేర బకాయిలు పేరకపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నా.. కూలీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
News December 23, 2025
లిక్కర్ కిక్కు.. దక్షిణాదిలో తెలంగాణ టాప్!

దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. సగటున తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక(4.25L), తమిళనాడు(3.38L), AP(2.71L), కేరళ (2.53L) ఉన్నాయి. యావరేజ్‌గా తెలంగాణలో మద్యం తాగేందుకు తలసరి ఖర్చు ₹11,351 కాగా, APలో ₹6,399 వెచ్చిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఏడాదిలో అమ్ముడైన మొత్తం మద్యం, జనాభా ఆధారంగా తలసరి వినియోగాన్ని అంచనా వేస్తారు.
News December 23, 2025
ఆయిల్‌పామ్.. అంతర పంటలతో అదనపు ఆదాయం

ఆయిల్‌పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. కోకో, కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస, మొక్కజొన్న వంటి అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.


