News April 24, 2024
ఒత్తిడి వలన గర్భస్థ శిశువు ముఖంలో మార్పు

గర్భంపై పడే ఒత్తిడి కూడా శిశువు రూపురేఖల్ని నిర్ణయిస్తుందని లండన్లోని యూసీఎల్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఆ వివరాలను ‘నేచర్ సెల్ బయాలజీ’ జర్నల్లో ప్రచురించారు. దాని ప్రకారం.. చిట్టెలుక, కప్పల అండాలపై వారు పరిశోధనలు చేశారు. గర్భసంచిలో ఒత్తిడి ఉంటే అతి సున్నితంగా ఉండే గర్భస్థ శిశువు రూపురేఖలు మారిపోతాయి. ఒత్తిడి మరీ ఎక్కువైతే వైకల్యం కూడా రావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
Similar News
News December 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 103 సమాధానం

ఈరోజు ప్రశ్న: ఇతనికి తల, మెడ ఉండవు. కడుపు భాగంలోనే నోరు ఉంటుంది. చేతులు మాత్రం మైళ్ల దూరం వరకు సాగుతాయి. ఎవరతను?
సమాధానం: రామాయణంలోని అరణ్యకాండలో ఈ వింతైన పాత్ర కనిపిస్తుంది. అతని పేరు ‘కబంధుడు’. ఓ శాపం వల్ల ఈ రూపం పొందుతాడు. రాముడు ఇతని బాహువులను ఖండించడంతో శాపవిమోచనం కలిగి, తిరిగి గంధర్వ రూపాన్ని పొందుతాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమని రాముడికి సలహా ఇస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 21, 2025
బీజేపీకి భారీగా విరాళాలు

2024-25లో రాజకీయ పార్టీలకు ₹3,811 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా ఇవి అందాయి. బీజేపీకి ఏకంగా ₹3,112 కోట్లు (82%) రావడం గమనార్హం. కాంగ్రెస్కు ₹299 కోట్లు(8%), ఇతర పార్టీలకు ₹400 కోట్లు (10%) వచ్చాయి. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలివ్వడాన్ని సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. 2023-24లో ₹1,218 కోట్ల విరాళాలు వచ్చాయి.
News December 21, 2025
20 రోజుల్లో మూడు సభలు నిర్వహించనున్న BRS

TG: రాబోయే 20 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తొలుత మహబూబ్ నగర్(పాలమూరు) ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండలో సభలు నిర్వహించాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల సాధనకై పోరు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.


