News December 31, 2024
కొత్త ఏడాదిలో మార్పులివే..

* ఫీచర్ ఫోన్లలో ‘యూపీఐ 123పే’ చెల్లింపులు రూ.5వేల నుంచి రూ.10 వేలకు కేంద్రం పెంచింది.
* ఎలాంటి గ్యారంటీలు లేకుండా రైతులు రూ.2లక్షల వరకు రుణం తీసుకోవచ్చని RBI తెలిపింది
* చాలా కాలంగా ‘జీరో బ్యాలెన్స్’ ఉన్న, 2 ఏళ్లకు పైగా లావాదేవీలు జరపని, ఇన్‌యాక్టివ్ అకౌంట్స్‌గా నిర్ధారించిన బ్యాంకు ఖాతాలను మూసేయాలని RBI నిర్ణయించింది.
* ఏటీఎం నుంచి PF డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
Similar News
News September 17, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

TG: గ్రూప్-1 మెయిన్స్ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
GST సంస్కరణలతో వారికి మేలు: సత్యకుమార్

AP: జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి, పేదలకు మేలు చేసేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మార్పులతో ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. 2047నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రమిస్తోందన్నారు. గత ఐదేళ్లలో దివాళా తీసిన రాష్ట్ర ఎకానమీని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని తెలిపారు.
News September 17, 2025
మోదీ బయోపిక్.. పోస్టర్ రిలీజ్

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రూపొందుతోంది. దీనికి ‘మా వందే’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను క్రాంతి కుమార్ సీహెచ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో కనిపిస్తారు. పోస్టర్‌పై మోదీ సంతకం చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఉండగా.. ‘ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్ప బలం గొప్పది’ అని మోదీ చెప్పిన మాటలను ముద్రించారు.