News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News January 15, 2026
వికారాబాద్: అంగన్వాడీల్లో ఇన్ని ఖాళీ పోస్టులా?

VKB జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా, టీచర్ల కొరత వేధిస్తోంది. కొడంగల్ ప్రాజెక్టులో 234 కేంద్రాలు ఉండగా.. 73 ఆయా, 14 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మర్పల్లి 148 కేంద్రాలు ఉండగా.. 41 ఆయా, 30 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిగి ప్రాజెక్టులో 235 కేంద్రాలు ఉండగా.. 112 ఆయా, 21 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ ప్రాజెక్టులో 233 కేంద్రాలు ఉండగా.. 82 ఆయా, 18 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News January 15, 2026
ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో తీర్పు!

TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపునకు పాల్పడ్డారన్న MLAలు చింతా ప్రభాకర్, జగదీశ్ రెడ్డి ఫిర్యాదుపై ఇవాళ స్పీకర్ నిర్ణయం వెల్లడించనున్నారు. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్‌కు వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీరి అనర్హత పిటిషన్లపై తీర్పునకు మరింత సమయం పట్టనుంది.
News January 15, 2026
జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.


