News March 26, 2024
వాలంటీర్ల జీవితాలు మారుస్తా: చంద్రబాబు

AP: రాష్ట్రంలోని వాలంటీర్ల జీవితాలు మారుస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తా. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుతా. ఐటీని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తా. 100 రోజుల్లోనే జే బ్రాండ్ మద్యాన్ని అరికడతా. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టే బాధ్యత నాది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 2, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 2, 2026
మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


