News September 18, 2024

ప్రతి బాల్‌కు ముందు ‘ఓం నమః శివాయ’ జపం చేశా: కోహ్లీ

image

బీసీసీఐ స్పెషల్ ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విరాట్ కోహ్లీ పటిష్ఠమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నిర్మించారని, 25 ఏళ్ల వయసులోనే పవర్‌ఫుల్ టీమ్‌ను ఏర్పరిచారని గంభీర్ కొనియాడారు. కాగా 2014-15 ఆస్ట్రేలియన్ టూర్‌లో ప్రతి బాల్‌కు ముందు ఓం నమః శివాయ జపం చేసినట్లు కోహ్లీ తెలిపారు. 2009 NZ పర్యటనలో రెండున్నర రోజులు ‘హనుమాన్ చాలీస’ విన్నట్లు గంభీర్ చెప్పారు.

Similar News

News November 26, 2025

మిరపలో కొమ్మ ఎండు, కాయ కుళ్లు తెగులు – నివారణ

image

మిరపలో ఈ తెగులు తొలుత లేత కొమ్మలు, పూతకు ఆశించడం వల్ల పూత రాలి, చివర్ల నుంచి కొమ్మలు కిందకు ఎండుతాయి. కాయలను ఆశించడం వల్ల కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి, కుళ్లి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైఫెనోకోనజోల్ 25% EC 100ml లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3% SC 200mlలలో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి.

News November 26, 2025

ఏంటి బ్రో.. కనీస పోటీ ఇవ్వలేరా?

image

సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2 టెస్టుల్లోనూ ఓడిపోవడాన్ని IND ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. టెస్టులకు అవసరమైన ఓర్పు, సహనం మన క్రికెటర్లలో లోపించాయంటున్నారు. అలాగే కోచ్ గంభీర్ పనితీరూ సరిగా లేదని చెబుతున్నారు. ఆయన హయాంలోనే స్వదేశంలో NZ చేతిలో 3-0, ఆస్ట్రేలియాలో 1-3, ఇప్పుడు SA చేతిలో 0-2 తేడాతో పరాజయాలు పలకరించాయని గుర్తు చేస్తున్నారు.

News November 26, 2025

తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.