News March 17, 2024
కారు పార్టీలో కలకలం

ఒకవైపు కవిత అరెస్ట్.. మరోవైపు పార్టీ ఫిరాయింపులు BRSలో కలకలం రేపుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వరుసగా రాం.. రాం.. చెప్తుండటంతో ఎవరు ఎప్పుడు పక్కచూపులు చూస్తారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగేందుకు సిద్ధమవుతుండటం గులాబీ పార్టీని కంగారు పెడుతోంది. పార్లమెంట్ పోరుకు ముందు ఈ చేరికలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాంగ్రెస్, బీజేపీ టార్గెట్‌గా తెలుస్తోంది.
Similar News
News April 19, 2025
వేమన పద్యం

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.
News April 19, 2025
ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.
News April 19, 2025
ఇలా చేస్తే కోటీశ్వరులు కావొచ్చు!

పెట్టుబడుల కోసం చాలా మార్గాలున్నా, సిప్(SIP) అనేది దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంచి స్టాక్స్‌ను సెలెక్ట్ చేసుకొని నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటి లేదా అంతకుమించి జమ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే, మార్కెట్ల ఒడిదొడుకులు వల్ల స్వల్ప కాలంలో రాబడి ఉండదని, కనీసం పదేళ్లు కొనసాగిస్తామనే వారే SIP స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.