News July 9, 2024
మహానందిలో కలకలం.. యువకుడిపై చిరుతపులి దాడి

AP: నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈశ్వర్‌నగర్ సమీపంలో నాగన్న అనే యువకుడిపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో అతడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గోశాల, ఈశ్వర్‌నగర్ ప్రాంతాల్లో 2 వారాలుగా చిరుత కనిపిస్తోందని, ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News October 14, 2025
ALERT: రేపు భారీ వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరులోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 14, 2025
స్వదేశీ యాప్స్‌పై పెరుగుతున్న మోజు!

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో తర్వాత స్వదేశీ మ్యాప్స్ యాప్ ‘MapmyIndia’ ఇన్స్టాల్స్ భారీగా పెరిగాయి. 1995లో భారతీయ జంట రాకేశ్, రష్మీ వర్మ రూపొందించిన ఈ యాప్, Google Maps కంటే ముందే సేవలు అందిస్తోంది. ఇందులో ఉండే 3D జంక్షన్ వ్యూ ద్వారా సంక్లిష్ట జంక్షన్లలో దారి సులభమవుతుంది. గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై హెచ్చరికలు, లైవ్ సిగ్నల్ కౌంట్‌డౌన్ వంటి ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
News October 14, 2025
కాకినాడ సెజ్ భూములు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

AP: కాకినాడ సెజ్‌లోని 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల వద్ద రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని పేర్కొంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.