News April 6, 2025
ఈ నెల 30 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

చార్ ధామ్ యాత్ర ఈ నెల 30నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా వచ్చే నెల 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ గుళ్లను తెరుస్తారు. భక్తుల రక్షణార్థం 6వేలకు పైగా పోలీసుల్ని, భద్రతాసిబ్బందిని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. 10 కి.మీకి ఒక సెక్టార్ చొప్పున 137 సెక్టార్లుగా యాత్ర మార్గాన్ని విభజించామని నిరంతరం భద్రతాసిబ్బంది గస్తీ తిరుగుతుంటారని వారు స్పష్టం చేశారు.
Similar News
News April 7, 2025
రజినీ ‘కూలీ’కి అంత డిమాండా?

సూపర్‌స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాకు టాలీవుడ్‌లో భారీ డిమాండ్ నెలకొంది. ఏకంగా ఆరుగురు నిర్మాతలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. దీంతో సినిమా నిర్మాతలు రూ.40 కోట్ల వరకూ రేట్ చెబుతున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ‘రజినీ’ సినిమా కావడం, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి వారు కీలక పాత్రలు చేయడం మూవీకి ఈ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News April 7, 2025
కేంద్రం వక్ఫ్ బోర్డులను నియంత్రించడం లేదు: నడ్డా

కేంద్రం వక్ఫ్ బోర్డులను నియంత్రించాలని చూస్తోందన్న ఆరోపణల్ని BJP జాతీయాధ్యక్షుడు JP నడ్డా కొట్టిపారేశారు. ‘కేంద్రానికి ఆ ఉద్దేశం ఏమాత్రం లేదు. వక్ఫ్ బోర్డులు చట్ట పరిధిలో పనిచేయాలని, వాటి ఆస్తులు ముస్లింలకు విద్య, వైద్య, ఉద్యోగ కల్పనలో ఉపయోగపడాలనేదే మా ఉద్దేశం. తుర్కియే సహా అనేక ముస్లిం దేశాల అక్కడి వక్ఫ్ బోర్డుల్ని వాటి అధీనంలోకి తీసుకున్నాయి. కానీ మేం అలా చేయడం లేదు’ అని వివరించారు.
News April 7, 2025
బిగ్‌బాస్ హోస్ట్‌గా బాలకృష్ణ?

తెలుగు బిగ్‌బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హోస్ట్‌గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్. ‘అన్‌స్టాపబుల్’ ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌కూ బాలయ్య ప్లస్ అవుతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.