News September 19, 2024
చరణ్- బుచ్చిబాబు.. మరో ‘రంగస్థలం’ కానుందా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ కథను బుచ్చిబాబు నాలుగేళ్ల పాటు రాశారు. త్వరలో మూవీ స్టార్ట్ చేయనుండటంతో మూవీ కాస్ట్‌ను డైరెక్టర్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా టీమ్‌లోకి ‘తంగలాన్’ డ్రెస్ డిజైనర్ ఏకాంబరంను తీసుకున్నారు. ఈయనను తీసుకున్నారంటే ‘రంగస్థలం’లాంటి నేటివ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News January 24, 2026
క్లీనింగ్ టిప్స్

* ఫర్నిచర్‌పై గీతలు పడితే వాటిని షూ పాలిషర్తో క్లీన్ చేస్తే పోతాయి.
* ఫ్లాస్కులో దుర్వాసన రాకుండా ఉండాలంటే లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంచండి.
* చెక్క వస్తువులను పాలిష్ చేయాలంటే వెనిగర్, వేడినీళ్ళు కలిపి క్లాత్‌తో తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* బంగాళా దుంప తొక్కలతో గాజు వస్తువులను, అద్దాలను తుడిస్తే తళతళలాడతాయి.
News January 24, 2026
అలర్ట్.. 149 మిలియన్ల పాస్వర్డ్లు లీక్

ప్రపంచ వ్యాప్తంగా 149M(దాదాపు 15కోట్లు) యూజర్‌నేమ్‌లు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఇందులో Gmail, FB, ఇన్‌స్టా, నెట్‌ఫ్లిక్స్, బ్యాంకింగ్, క్రిప్టో అకౌంట్ల వివరాలు ఉన్నాయి. ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ద్వారా ఈ సమాచారం చోరీ అయినట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాస్వర్డ్లు మార్చుకోవాలని, ప్రతి అకౌంట్‌కు వేర్వేరుగా స్ట్రాంగ్‌గా ఉండేవి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
News January 24, 2026
రథ సప్తమి పూజ ఎందుకు చేయాలి?

సూర్యుడు జన్మించిన రోజు కాబట్టి దీన్ని ‘సూర్య జయంతి’గా జరుపుకొంటారు. సూర్యరశ్మి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, చర్మ వ్యాధులు, కంటి సమస్యల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేస్తారు. రథసప్తమి రోజున ఆచరించే అరుణోదయ స్నానం, సూర్యారాధన వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆయురారోగ్యాలు, సంతాన ప్రాప్తి, సకల కార్యసిద్ధి కోసం భక్తులు ఈ పర్వదినాన్ని అత్యంత నిష్టతో జరుపుకొంటారు.


