News January 10, 2025

అప్పన్నగా చరణ్ అద్భుతంగా చేశారు: చిరంజీవి

image

‘గేమ్‌ఛేంజర్’లో రామ్‌చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. ‘నిజాయితీ కలిగిన అప్పన్నగా, ఐఏఎస్ అధికారి రామ్‌నందన్‌గా చరణ్ అద్భుతంగా నటించారు. అతనికి వస్తున్న అభినందనలు చూసి సంతోషంగా ఉంది. నటీనటులు, నిర్మాత రాజు, దర్శకుడు శంకర్, మూవీ బృందం అందరికీ కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు.

Similar News

News January 11, 2025

ఊరెళ్లే జనాలతో రద్దీగా మారిన హైదరాబాద్

image

సంక్రాంతి పండగకు ఊరెళ్ల జనాలతో హైదరాబాద్‌ రద్దీగా మారింది. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలు కానుండటంతో ప్రజలు స్వస్థలాలకు బయల్దేరారు. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా నగరంలో రద్దీ కొనసాగనుంది.

News January 11, 2025

TODAY HEADLINES

image

* మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: రేవంత్
* అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
* అమ్మాయిల జోలికి వస్తే తొక్కి నార తీస్తా: పవన్
* కేటీఆర్‌పై మరో కేసు నమోదు
* సంక్రాంతికి ‘జనసాధారణ్’ ప్రత్యేక రైళ్లు
* రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్
* తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు

News January 11, 2025

BREAKING: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం

image

TG: MBNR జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి అరుణాచలం వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న కారు టైర్ బరస్ట్ కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అది చూసి వెనకున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. కాగా ఇవాళ ఉదయం సూర్యాపేట-ఖమ్మం హైవేపై జరిగిన <<15112586>>ఘటనలో<<>> నలుగురు మరణించారు.