News May 24, 2024
చార్ధామ్ యాత్ర: 12 రోజుల్లో 42 మంది మృతి

చార్ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉండటంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోతున్నారు. యాత్ర ప్రారంభమైన 12 రోజుల్లోనే 42 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో కేదార్‌నాథ్‌లోనే 19 మంది చనిపోయారు. యమునోత్రిలో 12 మంది, బద్రీనాథ్‌లో తొమ్మిది మంది, గంగోత్రిలో ఇద్దరు భక్తులు దైవ దర్శనానికి వచ్చి శ్వాసాడక మరణించారు.
Similar News
News November 15, 2025
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్

AP: 2026లో జరగనున్న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. అయితే రూ.2 వేల ఫైన్‌తో నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా చెప్పారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఫెయిలైన, ప్రైవేట్ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.
News November 15, 2025
బిడ్డకు పాలిస్తే క్యాన్సర్ నుంచి రక్షణ

తల్లిపాలివ్వడం బిడ్డకే కాదు తల్లికీ రక్షేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దీనివల్ల మహిళల్లో ఎక్కువగా కనిపించే ట్రిపుల్ నెగెటివ్ అనే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. డెలివరీ తర్వాత వక్షోజాల్లో సీడీ8+టీ అనే వ్యాధినిరోధక కణాలు ఏర్పడతాయి. ఇవి శక్తిమంతమైన రక్షకభటుల్లా పనిచేస్తూ వక్షోజాల్లోని క్యాన్సర్ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
News November 15, 2025
30 ఓట్లతో గెలిచాడు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒకే ఒక్క సీటు గెలిచింది. రామ్‌గఢ్ నుంచి పోటీ చేసిన సతీశ్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్లతో గట్టెక్కారు. ఆయనకు 72,689 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌కు 72,659 ఓట్లు పడ్డాయి. చివరి వరకూ ఇద్దరి మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా సతీశ్‌నే వరించింది. ఇక బిహార్‌లో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.


