News August 8, 2024
హత్య కేసులో హీరో దర్శన్‌పై ఛార్జ్‌షీట్?

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో <<13490637>>దర్శన్<<>> సహా 17 మందిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ ప్రభుత్వాన్ని కోరింది. అక్కడి నుంచి అనుమతి రాకపోతే ప్రస్తుతం విచారణ జరుగుతున్న సివిల్ కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది.
Similar News
News December 12, 2025
తిరుపతి జనసేనలో అంతర్గత లుకలుకలు.!

తిరుపతి జనసేనలో అంతర్గత కుమ్ములాటలు బయట పడినట్లు తెలుస్తోంది. కొందరు YCP నేతలకు సహకరిస్తున్నారట. DCM పవన్ మార్ఫింగ్ ఫొటోపై కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని ఆ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారట. పార్టీలో లేని వ్యక్తి పెత్తనం ఏంటి అని చర్చించుకుంటున్నారట. అందుకే కేసు నమోదుకే పోలీసులు పరిమితమయ్యారని వారు విమర్శిస్తున్నారు. పోలీసులు మాత్రం విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
News December 12, 2025
పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం

TG: పుట్టగొడుగుల పెంపకంతో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చు. అందుకే నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం.. పుట్టగొడుగుల పెంపకంపై తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, రెడ్‌హిల్స్, నాంపల్లిలో 13.12.2025న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు B.Manga HO 8977714411, Shujauddin 8688848714ను సంప్రదించగలరు.
News December 12, 2025
హనుమాన్ చాలీసా భావం – 36

సంకట హటై మిటై సబ పీరా|
జో సుమిరై హనుమత బలవీరా||
శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అయిన హనుమంతుడిని ఎవరైతే భక్తితో స్మరించుకుంటారో, వారికి కలిగే అన్ని రకాల సంకటాలు, ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. వారిని పీడిస్తున్న బాధలు, దుఃఖాలు కూడా పూర్తిగా చెరిగిపోతాయి. హనుమంతుడి స్మరణ అనేది భక్తులకు బలం, ధైర్యం, కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


