News November 29, 2024
త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం: కిషన్ రెడ్డి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.428కోట్లతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు, అన్ని ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతూ 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు ఉంటాయన్నారు. మొత్తం 19 లైన్లలో 25 రైళ్ల జతలు రాకపోకలు కొనసాగించనున్నాయి. దీని వల్ల కాచిగూడ, HYD, SEC స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News December 17, 2025
ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ చూడొచ్చు

ఇకపై ఫోన్లలో ఇన్‌స్టా రీల్స్ చూస్తూ కళ్లు పాడుచేసుకునే భారం తగ్గిపోనుంది. Insta టీవీ యాప్‌ను విడుదల చేసింది. దీంతో పెద్ద స్క్రీన్‌పై రీల్స్, షార్ట్ వీడియోలను వీక్షించవచ్చు. ముందుగా USలోని సెలక్టెడ్ అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌పై దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భవిష్యత్తులో ఇతర టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌కు విస్తరించనున్నారు. TVలోనూ SM వినియోగం పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
News December 17, 2025
గాజాకు బలగాలు?.. సంకటంలో పాకిస్థాన్!

గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్‌కు సైనికులను అందించాలని పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అయితే దీనికి ఒప్పుకోలేక, కాదనలేక పాక్ సంకటంలో ఉంది. సైనికులను పంపిస్తే సొంత దేశంలోనే నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది. US, ఇజ్రాయెల్‌ను పాక్ ఇస్లామిక్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైనికులను పంపకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది పాక్ పరిస్థితి.
News December 17, 2025
ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో మృతి

TG: తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది.


