News May 26, 2024

వాట్సాప్‌లో ‘చాట్ థీమ్స్’ ఫీచర్

image

IOS యూజర్లకు వాట్సాప్ ‘చాట్ థీమ్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. ఇందులో మొత్తం 5 వేర్వేరు రంగుల్లో థీమ్స్ ఉంటాయి. వాటిలో యూజర్లు తమకు నచ్చిన కలర్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ చాట్ థీమ్‌గా మారుతుంది. వాల్ పేపర్, చాట్ బబుల్స్ ఆ రంగులోనే కనిపిస్తాయి. ఆయా యూజర్ల యాప్‌లో ఇంటర్ ఫేస్‌ ఛేంజ్ అవుతుంది. దీని వల్ల ఇతరుల యాప్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవు.

Similar News

News December 29, 2024

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం

image

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్‌పై ఆమె విజయం సాధించారు. 2019లోనూ ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్‌గా హంపి రికార్డులకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు.

News December 29, 2024

సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు

image

TG: సంక్రాంతి పండుగకు 5వేల ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏయే రూట్లలో ఇవి నడుస్తాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి.

News December 29, 2024

నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

image

TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర్వహించనున్నారు. దీంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.