News August 12, 2025

ChatGPT సలహా ప్రాణం మీదకొచ్చింది!

image

డైట్ ప్లాన్ కోసం ChatGPTని వాడిన 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. టేబుల్ సాల్ట్‌కు బదులు సోడియం బ్రోమైడ్ తీసుకోవాలని సూచించడంతో అతను 3 నెలలుగా దీనిని వాడుతున్నాడు. ఇది విషంగా మారడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని, తీవ్రదాహం, పట్టుకోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Similar News

News August 13, 2025

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

image

హైదారాబాద్‌లో వర్షం మొదలైంది. వాతావరణ నిపుణులు చెప్పినట్లుగానే అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్షం కురవడం ప్రారంభమైంది. ఈశాన్య భాగం నుంచి వర్షం మొదలైంది. 3 గంటల కల్లా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

News August 13, 2025

ఆల్ట్‌మన్-మస్క్.. ఎవరు నమ్మదగిన వ్యక్తి?

image

OPEN AI CEO శామ్ ఆల్ట్‌మన్‌ని ఎలాన్ మస్క్ తనదైనశైలిలో ట్రోల్ చేశారు. ‘ఆల్ట్‌మన్, మస్క్‌లో ఎవరు నమ్మదగిన వ్యక్తి?’ అని ChatGPTని అడిగారు. అదేమో ఎలాన్ మస్క్ అని చెప్పింది. ఆ విషయాన్ని ‘X’లో పోస్ట్ చేశారు. కొసమెరుపేంటంటే కామెంట్స్‌లో ఓ యూజర్ Grokని అదే ప్రశ్న అడగ్గా.. అది మాత్రం ఆల్ట్‌మన్ పేరు చెప్పింది. మొత్తానికి ఎవరు తయారు చేసిన AIలు వారినే నమ్మట్లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News August 13, 2025

ALERT: కాసేపట్లో అతి భారీ వర్షాలు!

image

TG: మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు. ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు. వరంగల్, హనుమకొండ, జగిత్యాల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు’ కురుస్తాయి అంటున్నారు. HYDలో మోస్తరు జల్లులు పడతాయని చెప్తున్నారు.