News December 17, 2024
ChatGPT సెర్చ్ ఇంజిన్ ఇకపై ఫ్రీ

పెయిడ్ యూజర్లకే అందుబాటులో ఉన్న ChatGPT సెర్చ్ ఇంజిన్ సేవలు ఇకపై అందరికీ ఫ్రీగా అందనున్నాయి. సెర్చ్ ఇంజిన్ విషయంలో గూగుల్‌కు పోటీగా దీని మాతృసంస్థ OpenAI అడ్వాన్స్డ్ వాయిస్ సెర్చ్ మోడ్ తదితర ఫీచర్లను జత చేసింది. ChatGPT లాగిన్ అయిన యూజర్లు సెర్చ్ ఇంజిన్ App, సైట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఇన్నాళ్లు డేటా బేస్‌లోని సమాచారమిచ్చిన ChatGPT ఇకపై సెర్చ్ ఇంజిన్ సాయంతో వెబ్‌లోని సమాచారాన్ని అందించనుంది.
Similar News
News November 23, 2025
కార్తీకం వెళ్లినా.. తగ్గని కూరగాయల ‘ఘాటు’

కార్తీక మాసం ముగిసినా కూరగాయల ధరల జోరు మాత్రం తగ్గలేదు. రైతుబజార్లలో సైతం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్లో ఆకాకర రూ.130, చిక్కుడు రూ.110, వంకాయ, బీర రూ.70, టమాటా రూ.60 పలుకుతున్నాయి. ఇక బీన్స్ గింజలు ఏకంగా రూ.300కు చేరాయి. ధరల మోతతో కూరగాయలు కొనలేక పచ్చడి మెతుకులే గతి అవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
News November 23, 2025
టెన్త్, ఐటీఐ అర్హతతో 542 పోస్టులు

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 542 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల పురుషులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పీఈటీ/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.50, SC, STలకు ఫీజు లేదు. దరఖాస్తు హార్డ్ కాపీ, సర్టిఫికెట్ జిరాక్స్‌లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 23, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ (ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://iigm.res.in/


