News February 20, 2025

‘ఛావా’ కలెక్షన్ల ప్రభంజనం

image

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ మూవీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి మూవీ ఇదేనని పేర్కొన్నాయి. లీడ్ రోల్‌లో విక్కీ కౌశల్ నటన అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తెలుగులోనూ రిలీజ్ చేయాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News January 5, 2026

బెండలో కాయ తొలుచు పురుగు నివారణ ఎలా?

image

బెండ మొక్క పెరుగుదల దశలో కాయ తొలిచే పురుగు మొక్క మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచి తొలగించాలి. వీటి నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్‌ నీటిలో 3గ్రా. కార్బరిల్‌ (లేదా) 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 5, 2026

HOT TOPIC: ఆంధ్రకూ పాకిన జలజగడం…

image

TGలో INC, BRSల వరకే ఉన్న జలజగడం కాస్తా APకీ పాకింది. YCP విమర్శలతో ‘రాయలసీమ లిఫ్ట్‌’ పై రేవంత్ చేసిన కామెంట్లను AP GOVT ఖండించింది. దానివల్లే తాను TDPని వదిలానని రేవంత్ విమర్శలు చేశారు. దీంతో నదీ జలాలపై రిప్లై‌కి CBN సిద్ధమవుతున్నారు. అటు ఈ అంశాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకొనేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా నదీ జలాలపై వేడెక్కిన రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

News January 5, 2026

OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.