News February 24, 2025
వారికి క్షమాపణలు చెప్పిన ‘ఛావా’ డైరెక్టర్

‘ఛావా’ సినిమాలో తమ పూర్వీకులు గనోజీ, కన్హాజీ షిర్కేను అవమానించారనే వారసుల ఆరోపణలపై దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్ స్పందించారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలని కోరారు. అంతకుముందు సినిమాలో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తామని షిర్కే వారసులు దర్శకుడిని హెచ్చరించారు. మరోవైపు ఛావా థియేటర్లలో హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
Similar News
News February 24, 2025
2028లో మేమే అధికారంలోకి వస్తాం: జగన్

AP: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు జగన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడుతామని చెప్పారు. 2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఇచ్చిన ఇళ్లను వెనక్కితీసుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
News February 24, 2025
కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారు: రేవంత్ రెడ్డి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని చెబుతుందో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీ అని చెప్పుకునేందుకు బీఆర్ఎస్‌కు అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు.
News February 24, 2025
ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం: పెద్దిరెడ్డి

AP: అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని అడిగామని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే సానుకూల స్పందన రాలేదని చెప్పారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇవాళ సభకు హాజరైన YCP నేతలు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే.