News March 5, 2025
‘ఛావా’ సంచలనం.. రూ.500 కోట్లకు చేరువలో మూవీ

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ హిందీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. 19 రోజులకు రూ.471 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఎల్లుండి తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఈ వారాంతానికి రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది. మరాఠా యోధుడు శంభాజీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Similar News
News March 6, 2025
గంటకు 3 లక్షల కి.మీ.. నెలలోపే మార్స్‌పైకి

రష్యా ఓ అద్భుత రాకెట్ ఇంజిన్‌ను ఆవిష్కృతం చేసింది. మార్స్‌పైకి వెళ్లేందుకు అత్యంత వేగవంతమైన ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది గంటకు 3,13,822 కి.మీ వేగంతో నింగిలోకి దూసుకెళ్తుంది. దాదాపు 30 నుంచి 60 రోజుల్లోనే ఇది అంగారకుడిపైకి చేరుకుంటుంది. 2030 నాటికి దీనిని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ రోసాటామ్ భావిస్తోంది.
News March 6, 2025
హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు?

ఉగ్రవాద సంస్థ హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం, ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించడం కోసం ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హమాస్‌ను 1997లో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
News March 6, 2025
DAVID MILLER: ఓడినా వణికించాడు..!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఫైటింగ్ సెంచరీతో న్యూజిలాండ్‌ను వణికించాడు. ఇలా ప్రత్యర్థులను భయపెట్టడం మిల్లర్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సుడిగాలి ఇన్నింగ్సులు ఆడారు. తన వన్ మ్యాన్ ఆర్మీ షోతో ప్రత్యర్థులను భయపెట్టారు. 2013 CT సెమీస్, 2014 T2O సెమీస్, 2015 WC సెమీస్, 2023 WC సెమీస్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడారు. కానీ తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయారు.