News April 10, 2025
రేపు ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ మూవీ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 18, 2025
ప్రభుత్వ వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు

TG ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటులాంటి వైద్యం లభించిందని AP వ్యక్తి చేసిన <<16116590>>ట్వీట్‌పై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అన్న నానుడిని తిరగ రాశారు. తాము తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నిరూపించి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. ఇతర వైద్యులకు మీరు ఆదర్శంగా నిలిచారు. మీకు నా అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు.
News April 18, 2025
DANGER: రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ధూమపానం వల్ల ఎలాంటి అనర్థాలున్నాయో సిట్టింగ్ వల్ల కూడా అంతే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఎముకలు పెళుసుగా మారతాయి. అలాగే, గుండె జబ్బులు, టైప్-2 డయాబెటీస్‌తో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలొస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకే 45 నిమిషాలకొకసారి 10 నిమిషాలు నడిస్తే మంచిది’ అని సూచిస్తున్నారు.
News April 18, 2025
మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్‌లను పెంచాయి.