News April 22, 2025
‘ఛావా’ మరో రికార్డ్

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ మరో రికార్డ్ సాధించింది. కేవలం హిందీలో రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. గతంలో స్త్రీ-2, పుష్ప-2 ఈ ఘనత సాధించాయి. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఓవరాల్‌గా రూ.800 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లోనూ నంబర్-1 స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.
Similar News
News April 22, 2025
పదేళ్ల పిల్లలకూ సొంతంగా బ్యాంక్ లావాదేవీలకు అనుమతి

ప్రస్తుతం మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ ఎవరైనా గార్డియన్‌గా ఉండటం తప్పనిసరి. ఇకపై పదేళ్లు దాటిన పిల్లలు కూడా ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేలా RBI మార్గదర్శకాలను విడుదల చేసింది. సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ అకౌంట్లను తెరిచి లావాదేవీలను సాగించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, చెక్ బుక్ సదుపాయమూ ఉంటుంది. జులై 1 నుంచి ఈ రూల్స్‌ను అమలు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది.
News April 22, 2025
నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జెడ్డాలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. మోదీ, సల్మాన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో ఒప్పందాలపై సంతకాలతో పాటు ఆర్థిక, మిలిటరీ భాగస్వామ్యం, రాజకీయ సంబంధాలపై చర్చ జరగనుందని సౌదీలోని భారత అంబాసిడర్ అజాజ్ ఖాన్ వెల్లడించారు.
News April 22, 2025
IPL: ‘టాప్’ లేపుతున్న గుజరాత్

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతోంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు సైతం ఆ జట్టు వద్దే ఉన్నాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ 417 రన్స్, బౌలర్ ప్రసిద్ధ్ 16 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్, గిల్, బట్లర్‌తో GT టాప్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది.