News November 16, 2024
మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్లు రూ.25 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. FIR ప్రకారం.. డిప్యూటీ SPగా పనిచేసి రిటైరైన జగదీశ్‌కు UP ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇప్పిస్తామని నమ్మబలికి కొంతమంది రూ.25 లక్షలు తీసుకున్నారు. పని అవ్వకపోవడంతో డబ్బు తిరిగివ్వమని అడగ్గా చంపేస్తామని బెదిరించారు. నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News November 7, 2025
శుభ సమయం (07-11-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ విదియ మ.2.28 వరకు
✒ నక్షత్రం: కృతిక ఉ.6.58 వరకు
✒ శుభ సమయాలు: ఉ.10.05-10.35, సా.5.40-6.10
✒ రాహుకాలం: ఉ.10.30-12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12
✒ వర్జ్యం: రా.9.52-11.22
✒ అమృత ఘడియలు: శే. అమృతం ఉ.6.45 వరకు, రా.2.21-3.50
News November 7, 2025
TODAY TOP STORIES

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.


