News April 5, 2025
ప్రేమ పేరుతో మోసం.. 4 పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్య జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది. మార్చి 24న పెళ్లి జరగ్గా, మరుసటి రోజే వాటితో పరారైంది. శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే 3పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని తెలిసింది.
Similar News
News December 2, 2025
హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు: బండి

హిందువులంటే కాంగ్రెస్‌కు ద్వేషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. <<18447956>>CM రేవంత్<<>> హిందూ దేవుళ్లను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ MIMకి మోకరిల్లింది. తమది ముస్లింల పార్టీ అని రేవంత్ కూడా అన్నారు. BRS కూడా హిందువులను కించపరిచింది. కానీ BJP ఇతర మతాల్ని అవమానించలేదు. హిందువులు ఇలా అవమానాన్ని భరిస్తూనే ఉంటారా లేదా ఒక్కటవుతారా’ అని పేర్కొన్నారు.
News December 2, 2025
స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్షలు వాయిదా

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేసింది. ఈ పరీక్షలకు కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. కాగా TG SET పరీక్షలు డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని OU ఇంతకు ముందు షెడ్యూల్ విడుదల చేసింది. 3వ తేదీ నుంచి హాల్ టికెట్ల జారీకీ ఏర్పాట్లు చేసింది. అయితే స్థానిక ఎన్నికలు అదే తేదీల్లో రావడంతో వాయిదా వేసింది.
News December 2, 2025
రెండు దశల్లో జనగణన: కేంద్రం

జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నట్లు లోక్‌సభలో కేంద్రం స్పష్టతనిచ్చింది. 2026 APR-SEP మధ్య రాష్ట్ర ప్రభుత్వాల సౌలభ్యాన్ని బట్టి ఏవైనా 30 రోజుల్లో ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరిలో జనగణన ఉంటుందని తెలిపింది. జనాభా లెక్కింపులో కులగణన చేపట్టనుంది. J&K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాక్ వంటి మంచు ప్రాంతాల్లో 2026 SEPలో జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది.


