News April 11, 2025
చేబ్రోలుకు 14 రోజుల రిమాండ్.. 111 సెక్షన్ పెట్టడంపై జడ్జి ఆగ్రహం

AP: వైఎస్ భారతిని అసభ్యకర వ్యాఖ్యలతో దూషించిన చేబ్రోలు కిరణ్ కుమార్కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కిరణ్ కుమార్పై 111 సెక్షన్ పెట్టడంపై జడ్జి మంగళగిరి రూరల్ సీఐపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News November 26, 2025
కలెక్టర్ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.
News November 26, 2025
మూవీ అప్డేట్స్

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్కు ముందే కేవలం తెలుగు స్టేట్స్లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్లో నటిస్తారని టాక్.
News November 26, 2025
iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.


