News August 6, 2024

అన్ని లారీలను తనిఖీ చేయండి: మనోహర్

image

AP: కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక నిఘా పెట్టారు. 8 విభాగాల పర్యవేక్షణలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ నుంచి ముంబై రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో నిన్న ఒక్కరోజే రీసైక్లింగ్ రేషన్ బియ్యం తరలిస్తున్న 6 లారీలను గుర్తించారు. దీంతో పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఇవాళ ఆదేశించారు.

Similar News

News January 12, 2026

పండుగల్లో ఆఫర్ల మాయలో పడకండి

image

పండుగ సమయాల్లో ప్రకటించే ఆఫర్ల మాయలో పడ్డామంటే బడ్జెట్ దాటిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కరోజు ఆనందం కోసం చూస్తే కొన్ని నెలలపాటు సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి అప్పు తీసుకోవద్దు అనే నియమాన్ని పాటించండి. వేటికెంత కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఏమేం కావాలో జాబితా రాసుకొని దానికే పరిమితమవ్వాలి.

News January 12, 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

image

కాన్పూర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>)అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్(ఒకేషనల్), టెన్త్, ITI అర్హతగల వారు దరఖాస్తును JAN 30 వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు18- 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. https://hal-india.co.in

News January 12, 2026

నెలలో పెళ్లి.. అమెరికా అదుపులో నేవీ అధికారి!

image

అమెరికా స్వాధీనం చేసుకున్న <<18803079>>రష్యా నౌకలో<<>> ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. అందులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ రిక్షిత్ చౌహాన్(26) కూడా ఉన్నారు. ఫిబ్రవరి 19న ఆయన పెళ్లి జరగాల్సి ఉంది. రష్యా సంస్థ ఆయన్ను తొలిసారి సముద్ర విధులకు పంపింది. ఈ క్రమంలో ఈనెల 7న చౌహాన్‌తో మాట్లాడామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కొడుకును సురక్షితంగా తీసుకురావాలని తల్లి రీతాదేవి వేడుకుంటున్నారు.