News December 3, 2024

చెక్ బౌన్స్ కేసు.. హోంమంత్రి అనితపై హైకోర్టు అసహనం

image

AP: రూ.70 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఎలా పడితే అలా పిటిషన్ వేయడం సరికాదని హోంమంత్రి అనితకు హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదుదారునితో తనకు రాజీ కుదిరినందున కేసు ప్రొసీడింగ్స్ కొట్టేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజీలో ఏం కుదిరింది? సమస్యకు ఏం పరిష్కారం చూపారో చెప్పాలంది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

Similar News

News October 26, 2025

శ్రీరామ నామ జప ఫలితాలు

image

నిరంతరం శ్రీరామ నామ జపం చేయడం వలన మనస్సుకు శాంతి లభిస్తుంది. పాపాలు, దోషాలు నశించి, చిత్తశుద్ధి కలుగుతుంది. దీని ద్వారా హృదయంలో భగవంతుని పట్ల భక్తి పెంపొందుతుంది. నామ సంకీర్తన వలన దుఃఖాలు తొలగి, జీవితంలో ఆనందం నిండుతుంది. అష్టైశ్వర్యాలు, మోక్షం వంటి ఫలాలను కూడా ఈ నామ జపం ప్రసాదిస్తుంది. సర్వవిధాల శ్రేయస్సును, అంతిమంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి నామ జపం ఉత్తమమైన మార్గం. <<-se>>#Bakthi<<>>

News October 26, 2025

భారీ వర్ష సూచన.. మరికొన్ని జిల్లాల్లో సెలవులు

image

AP: రేపట్నుంచి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రకాశం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 27, 28, 29 తేదీల్లో హాలిడేస్ ఇచ్చారు. విశాఖ, ఏలూరు జిల్లాలో 27, 28 తేదీల్లో.. చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో 27న సెలవులిస్తూ డీఈవోలు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు <<18106376>>హాలిడేస్ ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.

News October 26, 2025

వరల్డ్ కప్ ఆడటమే రోహిత్ లక్ష్యం: కోచ్

image

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రచారాన్ని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కొట్టిపారేశారు. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు గు‌డ్‌న్యూస్ చెప్పారు. 2027 వరల్డ్ కప్ వరకు ఆడటమే రోహిత్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ తర్వాతే రిటైర్ అవ్వాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. మరోవైపు AUSలో చివరి మ్యాచ్ ఆడేశానంటూ రోహిత్ SMలో పోస్ట్ చేశారు. ‘వన్ లాస్ట్ టైమ్.. సైనింగ్ ఆఫ్ ఫ్రం సిడ్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు.