News October 10, 2025
తెల్ల జుట్టుకు సొరకాయతో చెక్

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతోంది. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా వంటింట్లో ఉండే సొరకాయ దీనికి పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. సొరకాయను ముక్కలు చేసి వారంపాటు ఎండబెట్టుకోవాలి. ఒక పాత్రలో కొబ్బరినూనె, ఎండబెట్టిన ముక్కలు వేసి మరిగించాలి. దీన్ని వడబోసి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని వారానికొకసారి తలకు అప్లై చేసి తలస్నానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది. <<-se>>#haircare<<>>
Similar News
News October 10, 2025
బాలికలకు స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేసుకోండి

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో సంస్థ సంతూర్ ఉమెన్ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివిన బాలికలు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతూ ఉండాలి. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 15. ఎంపికైనవారికి రూ.30వేలు అందుతుంది.
వెబ్‌సైట్: <
News October 10, 2025
3,500 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

కెనరా బ్యాంకులో 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి OCT 12 చివరితేదీ. APలో 242, TGలో 132 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైన 20-28ఏళ్ల వయస్కులు అర్హులు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.canarabank.bank.in
* ప్రతి రోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News October 10, 2025
లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి ముద్రలు వద్దు: నెటిజన్లు

దైవ దర్శనాలకు వెళ్లి తిరిగివచ్చిన భక్తులను ఓ సమస్య వెంటాడుతోంది. ప్రముఖ దేవాలయాల లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి బొమ్మలు, ఆలయ గోపురాలు ముద్రించడమే దీనికి కారణం. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాక ఖాళీ బాక్సులు, కవర్లను చెత్తలో ఎలా పారేస్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అందుకే దేవాలయం, దేవుడి బొమ్మలకు బదులు ఆలయ పేరు లేదా లోగోను ముద్రించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?