News October 16, 2024

ప్లాట్ కొనేముందు ఓసారి చెక్ చేసుకోండి!

image

హైడ్రా భయంతో HMDA పరిధిలో ప్లాట్ కొనేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈక్రమంలో ధ్రువీకరించిన లేఅవుట్లలోనే ప్లాటు కొనడం శ్రేయస్కరమని రియల్ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీరు చూస్తున్న లేఅవుట్ అనధికారికంగా ఏర్పాటు చేసిందా? ప్రభుత్వ అనుమతులున్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. వీటిని <>HMDA తన అధికారిక వెబ్‌సైట్‌<<>>లో ఉంచింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ పరిధిలోనివి చెక్ చేసుకోండి.

Similar News

News December 11, 2025

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల పేరిట ‘సైబర్’ వల.. జాగ్రత్త: సజ్జనార్

image

TG: ​బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల కోసం RBI తెచ్చిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్‌ను సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారని HYD CP సజ్జనార్ తెలిపారు. డబ్బులు ఇప్పిస్తామంటూ నకిలీ లింకులు పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, అధికారిక సైట్‌ను (udgam.rbi.org.in) మాత్రమే వాడాలని సూచించారు. ‘RBI OTPలు, పాస్‌వర్డ్‌లు అడగదు. మోసపోతే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని కోరారు.

News December 11, 2025

పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర కావాల్సిందే..

image

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసికారోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.

News December 11, 2025

పరిధి దాటారు, రేపు లొంగిపోండి: సుప్రీంకోర్టు

image

తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ACP వెంకటగిరి ఎదుట 11AM లోపు లొంగిపోవాలని పేర్కొంది. SIB చీఫ్‌గా తన పరిధి దాటి వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అటు బెయిల్ రద్దుతో పాటు, 14 రోజులు ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది.