News July 17, 2024
ఈ రోడ్ల పరిస్థితి చూడండి: రాంప్రసాద్ రెడ్డి

AP: మదనపల్లి పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి రాయలసీమలోని రోడ్ల అభివృద్ధిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతిపత్రం అందించారు. రాజంపేట-రాయచోటి- కదిరి స్టేట్ హైవేను నేషనల్ హైవేగా మార్చాలని, కడప-రాయచోటి రోడ్‌ను 4 లైన్లకు విస్తరించాలని, అన్నమయ్య జిల్లాలో మౌలిక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాగా ఆదినాథ్ శ్రీగురు మహావతార్ బాబాజీ ఆలయ ప్రాణప్రతిష్ఠలో గడ్కరీ పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో నికోలస్‌ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.

మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.