News October 30, 2024
పచ్చదనంతో ఈ సమస్యలకు చెక్!

పచ్చదనం కలిగిన పరిసరాల్లో నివసిస్తున్న వారు గుండె, షుగర్, BP వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లేనని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా పార్కులు, తోటల చుట్టూ ఉన్న ఇంట్లో నివసించడం వల్ల స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం తక్కువని తేలింది. చుట్టూ భవనాలతో నిండిన కార్యాలయాల్లో పనిచేయడం వల్ల శబ్ద కాలుష్యానికి గురికావడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంది. BP, హార్ట్ బీట్ పెరగడానికి శబ్దకాలుష్యం ఓ కారణమని పేర్కొంది.
Similar News
News December 18, 2025
మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

AP: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పాలనా సంస్కరణలు నినాదాలను మించినవైతే గుర్తింపు తప్పకుండా వస్తుంది. అత్యంత గౌరవనీయమైన అవార్డు.. బలమైన జ్యూరీ. అది ఏ అవార్డు? ఎవరు గెలుచుకున్నారో ఊహించండి. మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్’ అని పేర్కొన్నారు. CM చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గురించే లోకేశ్ చెబుతున్నారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
News December 18, 2025
ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

<
News December 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 ఎగబాకి రూ.1,23,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000కు చేరింది. వెండి ధర రెండ్రోజుల్లోనే రూ.13వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


