News July 28, 2024
పాము కాటుతో వైకల్యానికి ‘హెపారిన్’తో చెక్!

పాము కాటు తర్వాత ప్రాణం నిలిచినా, కొన్నిసార్లు ఆ శరీర భాగంలో కణజాలం క్షీణిస్తుంది. ఇది వైకల్యానికి దారితీసే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ పరిశోధకులు దీనికి పరిష్కారం కనిపెట్టారు. గుండెపోటు వచ్చినప్పుడు 24hrsలోగా ఇచ్చే హెపారిన్ మందును పాము కాటు బాధితులకు ఇస్తే కణజాలం క్షీణతను ఆపొచ్చని నిరూపించారు. గాయమైన చోట హెపారిన్‌ను త్వరగా ఇంజెక్ట్ చేస్తే 90% వైకల్యాలను తగ్గించొచ్చట.
Similar News
News January 19, 2026
గొర్రె, మేక పిల్లల పెరుగుదలకు సూచనలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News January 19, 2026
మాఘ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాలు

మాఘమాసం పుణ్యకార్యాలకు, దానధర్మాలకు పెట్టింది పేరు. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు పోతాయని పురాణాల వాక్కు. రోజూ మాఘపురాణ పఠనం, విష్ణుసహస్రనామాలు స్మరించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
News January 19, 2026
వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే..

వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికుల కోసం బెంగాల్, అస్సాం ప్రాంతీయ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఇందులో బెంగాలీ స్పెషల్స్ అయిన బాసంతి పులావ్, ఛోలార్ దాల్, మూంగ్ దాల్, ధోకర్ వంటి సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. అస్సామీ రుచుల కోసం సువాసనలు వెదజల్లే జోహా రైస్, మతి మోహర్, మసూర్ దాల్, సీజనల్ వెజిటబుల్ ఫ్రైస్ అందిస్తున్నారు. ఇక తీపి వంటకాల్లో సందేశ్, నారికోల్ బర్ఫీ, రసగుల్లాలను చేర్చారు.


