News October 15, 2024

వాహనాలను కాపాడుకునేందుకు చెన్నై ప్రజల పాట్లు!

image

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై ప్రజలు అప్రమత్తమయ్యారు. వరద నుంచి రక్షించుకునేందుకు ద్విచక్రవాహనాలను ఇళ్లలో భద్రపరిచారు. అపార్ట్‌మెంట్లలోనూ పైకి తీసుకెళ్లి ఇంట్లో, వరండాలో పార్క్ చేశారు. దీంతోపాటు చెన్నై, వేలచేరి పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లపై స్థానికులు కార్లు పార్క్ చేసిన దృశ్యాలు వైరలవుతున్నాయి. విజయవాడలో వచ్చిన వరదల్లో కార్లు, బైక్‌లు పాడైన విషయం తెలిసిందే.

Similar News

News December 10, 2025

నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

News December 10, 2025

బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

image

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News December 10, 2025

సౌదీలో నాన్ ముస్లింలకు లిక్కర్ విక్రయాలు!

image

సౌదీలో నాన్ ముస్లింలు లిక్కర్ కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెలకు 50వేల రియాల్స్(13,300డాలర్లు), అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. మద్యం కొనే టైంలో శాలరీ స్లిప్ చూపించాలనే నిబంధన పెట్టనుందట. ప్రస్తుతం రాజధాని రియాద్‌లో దేశం మొత్తానికి ఒకే ఒక లిక్కర్ షాపు ఉంది. భవిష్యత్తులో మద్యం షాపుల సంఖ్య పెరిగే ఛాన్సుంది.