News April 29, 2024
చెన్నై రివేంజ్.. SRH పరాజయం
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి SRH 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు హెడ్(13), అభిషేక్(15) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మార్క్రమ్(32), క్లాసెన్(20) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. CSK బౌలర్లలో తుషార్ 4, పతిరన, ముస్తాఫిజుర్ చెరో 2, జడేజా, శార్దూల్ తలో ఒక వికెట్ తీశారు.
Similar News
News January 3, 2025
TODAY HEADLINES
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’
* తెలంగాణలో సాగు చేసే అందరికీ రైతుభరోసా!
* గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
* ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు
* JAN 3న తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
* ‘తొలి ప్రేమ’ రెమ్యునరేషన్‌తో బుక్స్ కొన్నా: పవన్ కళ్యాణ్
* పెళ్లి చేసుకున్న సింగర్ అర్మాన్ మాలిక్
* ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
* మనూ భాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న
News January 3, 2025
ఈసారి చలి వల్ల ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు
ఢిల్లీలో మొన్నటిదాకా కాలుష్యం వల్ల మూతబడిన స్కూళ్లు, ఇప్పుడు కోల్డ్ వేవ్స్ వల్ల మూతబడ్డాయి. శీతాకాలం వల్ల పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత కారణంగా NCR పరిధిలోని గౌతమ్‌బుద్ధ నగర్‌లో 8వ తరగతి వరకు సెలవు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ Janలో గతం కంటే అధికంగా చలి తీవ్రత ఉంటుందని IMD తెలిపింది.
News January 3, 2025
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ కీలకం?
సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.