News April 8, 2024

నేడు చెన్నైతో కోల్‌కతా ఢీ

image

IPL-2024లో భాగంగా ఇవాళ CSK, KKR జట్లు తలపడనున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా CSK 18, KKR 10 మ్యాచుల్లో గెలిచాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ సీజన్‌లో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో KKR 6 పాయింట్లతో రెండో స్థానంలో, చెన్నై 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. ఇవాళ ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News January 9, 2026

ఖరీఫ్, రబీకి అనుకూలం.. APHB 126 సజ్జ రకం

image

ఏపీలోని అనంతపురం వ్యవసాయ పరిశోధనా కేంద్రం APHB 126 సజ్జ రకాన్ని అభివృద్ధి చేసింది. ఈ రకం పంట కాలం 84 నుంచి 86 రోజులు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేయడానికి ఇది అనుకూలమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సజ్జరకంలో ఇనుము, జింకు అధికంగా ఉంటాయని తెలిపారు. హెక్టారుకు 30 నుంచి 33 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.

News January 9, 2026

ప్రమాదాల నివారణకు V2V టెక్నాలజీ: గడ్కరీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వెహికల్ టు వెహికల్(V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ప్రతి వాహనంలో దీన్ని ఏర్పాటుచేస్తాం. ఇందుకు 30MHz ఫ్రీక్వెన్సీని వాడుకునేందుకు DoT అనుమతించింది. వైర్‌లెస్ విధానంలో రోడ్లపై బ్లైండ్ స్పాట్స్, సమీప వాహనాల స్పీడ్‌ గురించి డ్రైవర్లను హెచ్చరించవచ్చు’ అని తెలిపారు.

News January 9, 2026

సర్జరీ తర్వాత తిలక్ వర్మ ఫస్ట్ రియాక్షన్

image

యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ తన <<18802433>>హెల్త్ కండిషన్<<>> గురించి ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చారు. రాజ్‌కోట్‌లో సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ‘మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను చాలా వేగంగా రికవర్ అవుతున్నాను. మీరు అనుకున్న దానికంటే ముందే గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు HYD చేరుకుని తిలక్ రీహబిలిటేషన్ ప్రాసెస్ మొదలుపెట్టనున్నారు.