News April 9, 2025

చెన్నై చెత్త రికార్డు.. అతడే కారణం?

image

IPL: పంజాబ్‌తో నిన్నటి మ్యాచ్‌లో CSK పోరాడి ఓడిన విషయం తెలిసిందే. 180+ టార్గెట్ ఉన్న మ్యాచ్‌ల్లో చెన్నైకిది వరుసగా 11వ పరాజయం. చివరిసారి 2018లో ఛేజ్ చేసింది. అయితే ఈ 11 మ్యాచ్‌ల్లో CSK కెప్టెన్ గైక్వాడ్ కేవలం ఒక ఫిఫ్టీ కొట్టి 8సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. అతడే వరుస పరాజయాలకు కారణమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా PBKSతో జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో చెన్నై ఒకటే గెలిచింది.

Similar News

News November 18, 2025

మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్‌లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

image

AP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్‌లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.