News January 10, 2025
రేపు చెక్కుల పంపిణీ: టీటీడీ ఛైర్మన్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విచారకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిపైనా నెట్టడం లేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, వారి పిల్లలకు చదువులు చెప్పించడంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 11, 2025
జాబ్ చేయాలా? జబ్బు పడాలా?
ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T చీఫ్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన చెప్పినట్లు పని చేస్తే ఉద్యోగిపై శారీరకంగానే కాకుండా మానసికంగానూ ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషులు 55 గంటలు, మహిళలు 40 గంటలకుపైగా పని చేస్తే గుండె జబ్బులు, డయాబెటిస్, ఒబెసిటీతో పాటు మరికొన్ని వ్యాధులు వస్తాయంటున్నారు. అవిశ్రాంతంగా పని చేయడం మంచిది కాదని చెబుతున్నారు.
News January 11, 2025
త్వరలోనే 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అవసరమన్నారు. మెరుగైన సేవలు అందించేలా 7 నుంచి 8 వేల మంది నియామకాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రైమరీ ఆస్పత్రుల్లో 28.96%, జిల్లా ఆస్పత్రుల్లో 14.51%, మిగతా చోట్ల 63.40% సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.
News January 10, 2025
కుంభమేళాకు స్టీవ్ జాబ్స్ సతీమణి
UPలో జరగనున్న మహా కుంభమేళాకు యాపిల్ కోఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ జాబ్స్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వామి కైలాషానంద మహారాజ్ వెల్లడించారు. ‘ఆమె మాకు కూతురులాంటిది. కమల అనే పేరు పెట్టాం. లారెన్ ఇక్కడకు రావడం రెండోసారి. వ్యక్తిగత ప్రోగ్రాం కోసం దేశానికి వస్తున్న ఆమె కుంభమేళాలో ధ్యానం చేస్తారు. తన గురువును కలుస్తారు. ఆమెను ఊరేగింపులోనూ చేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.