News January 5, 2025
చర్లపల్లి రైల్వే టర్మినల్ రేపే ప్రారంభం

HYD పరిధిలోని చర్లపల్లి రైల్వే టర్మినల్ను PM మోదీ రేపు ఉ.10:30కి వర్చువల్గా ప్రారంభించనున్నారు. రూ.428 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో దీనిని అభివృద్ధి చేశారు. 25 జతల రైళ్లు నడిచేలా మొత్తం 19 ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ వంటివి ఉంటాయి.
Similar News
News October 30, 2025
మెనుస్ట్రువల్ లీవ్కు ఫొటో అడగడంపై ఆందోళనలు

మహిళలు బయటకు చెప్పలేని అంశాల్లో రుతుస్రావం ఒకటి. విధులకూ వెళ్లలేని స్థితి. ఈ కారణంతో సెలవు అడిగిన సిబ్బందిని మెనుస్ట్రువల్ ఫొటోలు పంపాలని MD వర్సిటీ(హరియాణా) అధికారులు అడగడం వివాదంగా మారింది. గవర్నర్ వర్సిటీని సందర్శించినప్పుడు ఇది చోటుచేసుకుంది. చివరకు తాము వాడిన ప్యాడ్స్ ఫొటోలు పంపినా సెలవు ఇవ్వలేదని సిబ్బంది వాపోయారు. దీనిపై ఆందోళనలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ గుప్తా తెలిపారు.
News October 30, 2025
టీమ్ ఇండియాకు బిగ్ షాక్

WWC: ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న స్మృతి మంధాన(24) ఔటయ్యారు. తొలుత బంతిని అంపైర్ వైడ్గా ప్రకటించగా, ఆసీస్ క్యాచ్ కోసం రివ్యూ తీసుకుంది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్మృతి అసంతృప్తిగా పెవిలియన్కు వెళ్లారు. అంతకుముందు షెఫాలీ 10 పరుగులకే వెనుదిరిగారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 60/2గా ఉంది.
News October 30, 2025
2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్లో సంచలన విషయాలు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.


