News April 25, 2024

‘గేమ్ ఛేంజర్‌’ కోసం చెర్రీకి భారీ రెమ్యునరేషన్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్‌’ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నటించినందుకు చరణ్ భారీ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుందని, అందుకు ఆయన మొత్తంగా కలిపి రూ.120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Similar News

News November 26, 2025

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు చేయాలి: ఆర్టీఐ కమిషనర్

image

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు కావాలని ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అధికారులను సూచించారు. బుధవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, అధికారులు భయపడకుండా ప్రజలకు సమాచారం అందించాలన్నారు. అన్ని శాఖల్లో రిజిస్టర్ నిర్వహణ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు.

News November 26, 2025

2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

image

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్‌లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.